మంచి చెడుల గుట్టు విప్పిన నీషే-Beyond Good and Evil-Friedrich Nietzsche philosophy
Автор: Pramu Talks
Загружено: 2025-06-21
Просмотров: 9119
Описание:
#pramutalks
#drprasadamurthy
#nietzsche
#philosophy
#nietzsche followers
#philosophy lovers
#beyond good and evil
#Ram Gopal Varma
This is a brief review of great book 'beyond good and evil' written by German philosopher Frederich Nietzsche. The following is my Telugu translation ti his long ending poem of this book.
Long poem
1
ఓ జీవన మధ్యాహ్నమా.. ఓ ఆనంద కాలమా. నా వేసవి వనమా
చాటుమాటుగా వెతకడం వినడం చూడడం చాలా క్లిష్టమైన సంతోషం.
మిత్రులారా, మీకోసం పగలూ రాత్రీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాను
ఇదే మంచి సమయం మీరు ఎక్కడ ఉండిపోయారు?
. 2
గులాబీ మాలలు ధరించి మంచుకొండ వెండివెలుగు మీకోసం సిద్ధంగా లేదూ
సెలయేరు మిమ్మల్ని పిలుస్తోంది
గాలి, మేఘాలు నీలాకాశం వైపు ఎగురుతున్నాయి
డేగ కన్నుతో నిన్ను కనిపెట్టడానికి-
3
ఇంత ఎత్తయిన ప్రదేశంలో మీకోసం నా భోజన బల్ల సిద్ధం చేశాను!
ఆ నక్షత్రాల సమీపాన ఉన్నది ఎవరు?
అడుగున ఆపాడు గుంట దగ్గర పడి ఉన్నది ఎవరు?
నా రాజ్యం-అనంతమైన సరిహద్దులు ఉన్న రాజ్యం ఏది?
నా తేనె-ఆ సుగంధాన్ని గ్రోలింది ఎవరు?
4
మిత్రులారా, మీరేనా అక్కడ ఉన్నది!
మీరు వెతుకుతున్నది నన్నేనా?
మీరు అలా కళ్ళు అప్పగించి ఆగిపోవద్దు
కోపంతో నైనా సరే మాట్లాడండి-
నేను నేను కాదా..? నా చేతులూ కాళ్లూ ముఖం మారిపోయాయా?
మరి నేను మీకు ఏమవుతాను?
నేను నేను కాదా?
5
నేను మరొకడినా.. నాకు నేనే పరాయి వాడినా? లేక నా నుండే నేను పుట్టుకొచ్చానా?
ఒక మల్ల యోధుడు తనతో తానే కుస్తీ చేస్తాడా?
నా స్వీయ శక్తిని తరచూ నేనే అడ్డుకుంటున్నానా?
నా విజయంతో నేనే గాయపడి, నాకు నేనే అడ్డుపడుతున్నానా?
6
గాలి తీవ్రంగా వీచే చోటు వెతికాను
అక్కడ నా నివాసాన్ని ఏర్పరచుకున్నాను
ఎవరూ నివసించని చోటు..
ఒక ఏకాంత మంచు శిధిల ప్రదేశం..
ఏమీ నేర్వని మనిషి, దేవుడు, శాపం, ప్రార్థన-
హిమ సానువులను వెంటాడే సైతానుగా మారాయా ?
7
ఓ నా పురా స్నేహితులారా,
ప్రేమతో భయంతో నిండి మీరు వణికి పోతున్నారు-
వెళ్లిపోండి.. కోపంతో మాత్రం కాదు.
మీరు ఇక్కడ నివసించలేరు
మంచు వృక్షాలతో నిండిన సుదూర ప్రాంతం ఇది
వేటగాడు పైకి దూసుకు వెళ్లే చామోయిస్ లా ఉండాలి
8
నేను క్రూరమైన వేటగాడినా?
నా విల్లు ఎంత వొడుపుగా వంగి ఉందో చూడండి..!
ఆ బాణాన్ని వేసిన వాడే బలమైన విలుకాడు..
ఇప్పుడు ఆ బాధ.. ఆ బాణం ఎంత దుర్భరం..!
మీరు అన్వేషిస్తున్న ఇంటికి భద్రంగా చేరుకున్నారా?
9
ఓ హృదయమా, నువ్వు ఇక వెళ్ళు.. నువ్వు చాలా భరించావు-
నీ ఆశ చాలా బలమైనది
కొత్త స్నేహితుల కోసం నీ తలుపులు తెరుచుకునే ఉంటాయి
పాత వాటిని అలాగే ఉండనివ్వండి.. జ్ఞాపకాలకు స్వస్తి చెప్పండి
అప్పుడూ యువకుడివే.. ఇప్పుడూ యువకుడి గానే ఉండు
10
ఒక ఆశా పాశం ఒకప్పుడు మనల్ని కలిపి ఉంచింది-
(మసకబారుతున్న ఆ పంక్తులను తప్పుపట్టేది ఎవరు? వాటిని రాసింది ప్రేమ కదా!).. మన చేతులు తాకడానికి సిగ్గుపడే తోలు పలక లాంటిది ఇది-
ఎండిన చిట్లిన కాలిన ఆకుల్లాంటిది
11
ఓహో! ఇక మిత్రులు లేరు.. ఏంటబ్బా వారి పేర్లు..?
వాళ్లు దెయ్యాల్లా రాత్రి నా హృదయపు కిటికీని తడతారు
నన్ను తొంగి చూస్తూ.. మేము మేము అంటూ వెళ్ళిపోతారు
అవే పేలవమైన మాటలు,
ఒకప్పుడు అవి గులాబీ గుబాళింపులు-
12
నేను దిగులు పడిన
అర్థంకాని యవ్వన బాధలు..
నా బంధువులై నాతో పాటే మారిపోయిన బాధలు..
ఇప్పుడవి శిథిల నిషిద్ధ వృద్ధ భావనలు
నవజాత మానవుడు తప్ప ఇంకెవరూ నా భూమికి వారసులు కాదు
13
ఓ జీవన మధ్యాహ్నమా..
నా రెండో యవ్వన నిండు సంతసమా..
నా వేసవి పూలవనమా..
చూడడం వినడం వెతకడం ఎంత క్లిష్టమైన ఆనందమో..
స్నేహితుల కోసం చూస్తున్నాను
పగలు రాత్రి నా కొత్త స్నేహితుల కోసం చూస్తున్నాను
రండి.. ఇదే అదను!
14
ఈ గీతం పూర్తయింది
ఒక తీయని విషాదపు కేక లాంటి పలువరింత
ఈ గీతం పూర్తయింది
ఒక మంత్రగాడు రాసిన గీతం
అతడు మీకొక సకాల సన్నిహితుడు-
మధ్యాహ్న స్నేహితుడు
వద్దు నేను ఎవరని అడగొద్దు
ఒక మధ్యాహ్నం..
ఒకరు ఇద్దరుగా మారిన వేళ-
15
మన లక్ష్యాలు ఒకటే
పండగలకే పండగలా దీన్ని జరుపుకుందాం
అతిథులకి అతిథి మన స్నేహితుడు జరతుస్త్ర వచ్చాడు-
ప్రపంచం ఇక నవ్వుతుంది
విషాదపు మేలి ముసుగు తొలగింది
వివాహ ఉదయపు వేళ చీకటి వెలుగు ఒకటే-
…………………
Original Germany-F.W.Nietzsche
English-L.A.Magnus
Telugu- PrasadaMurthy
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: