Srisailam paataalaganga||Srisailam Ropeway||Srisailam Dam
Автор: DEEKSHIT Telugu Traveller
Загружено: 2022-04-12
Просмотров: 1105
Описание:
Srisailam paataalaganga ||Srisailam rope way || Srisailam dam
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారనీ దర్శనానికి వచ్చిన భక్తులు ప్రకృతి అందాలకు ఆలవాలమైన శ్రీశైలం డ్యామ్ రోప్ వే పాతాళ గంగ చూడకపోతే యాత్ర సంపూర్ణం కాదు పాతాళ గంగ చేర్చుకోవడానికి దేవస్థానం దగ్గర నుంచి ఉచిత బస్సులు నంది సర్కిల్ నుండి షేర్ ఆటోలు కలవు నంది సర్కిల్ నుండి పాతాళగంగ మెట్ల మార్గం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ మెట్ల మార్గానికి ఎడమవైపున ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్ హోటల్ ఉంటుంది అక్కడి నుంచి రోప్ వే పాతాళగంగ కు ఉంటుంది రోప్ వే టికెట్ రానుపోను 65 రూపాయలు ఒక్కొక్క కూపీ కి నలుగురు చొప్పున ప్రయాణం చేయవచ్చు రోప్ వే timeings ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రయాణ సమయం కొండపై నుంచి పాతాళగంగ కు ఐదు నిమిషాలు రోప్ వే దిగిన తర్వాత స్థాన ఘట్టానికి వెళ్లేవారు స్థానం ఘట్టానికి బోట్ లో డ్యాం చూసేవారు బోటింగ్ పాయింట్ కి వెళ్తారు బోటు టికెట్ 60 రూపాయలు బోటింగ్ పాయింట్ నుండి డ్యాం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది 20 నిమిషాలు బోట్ రైడ పాతాళగంగ దగ్గర కృష్ణా నదిలో నీరు ఎల్లప్పుడూ ఆకుపచ్చగా కనిపిస్తుంది దీనికి ఒక పురాణ ఇతి హాసమున్నది పూర్వం చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరములు యుద్ధము చేసి విజయం సాధించిన తర్వాత రాజ్యాంగ చేరుతాడు అంతఃపుర స్త్రీలు అందాల రాశి అయిన చంద్రమతి నీ చూసి ఆశిస్తాడు చంద్రమతి తన కుమార్తె అని తెలియక ఆమె మొహం పెంచుకుంటాడు చంద్రమతి ఎంత చెప్పినా న వినకపోవడంతో శ్రీశైల అరణ్యమునకు వెళ్లి శివుని అనుగ్రహం కోరుతుంది అక్కడ కూడా చంద్రగుప్తుడు వచ్చి ఆమె చెరపట్ట పోగా శివుడు ప్రత్యక్షమై కామంతో కళ్లు మూసుకుపోయిన చంద్రగుప్తుని పాతాళ గంగ లో పచ్చల రాయిగా పడి ఉండమని శపిస్తాడు అప్పుడు చంద్రగుప్తుడు శాప విమోచన కు శరణు వేడగా కలియుగంలో మహా విష్ణువు శ్రీశైలంలో స్నానమాచరించి నప్పుడు శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు
శ్రీశైలం డ్యాం 1961లో నెహ్రూ గారిచే శంకుస్థాపన చేయబడి 1981 లో పూర్తి అయింది ఈ డ్యామ్ పొడవు 512 మీటర్లు ఎత్తు 145 మీటర్లు జలాశయం నీటి మట్టం 885అడుగులతో కుడి ఎడమ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో1670 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది మొత్తం 12 గేట్లు ఉన్నాయి డ్యాం కు శ్రీశైలం డ్యామ్ ని తరువాత నీలం సంజీవరెడ్డి సాగర్ గా నామకరణం చేశారు
_________________________________
/ deekshittraveller
https://twitter.com/TeluguDeekshit?t=...
#srisailampaataalaganga
#srisailamdam
#placestovisitinsrisailam
#srisailamropeway
#deekshittelugutraveller
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: