ఢిల్లీ–భోగాపురం... ట్రయల్ రన్
Автор: vaji one
Загружено: 2026-01-03
Просмотров: 740
Описание: జిల్లాలోని భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్-ఛేంజర్‌గా మారబోతోంది . ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రైల్ రన్‌గా జనవరి 4న తొలి వాణిజ్య విమానం దిగనుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఈఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత, ఈ మే నెల నుండే ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: