Chaduvu sandelu - Vighnammu lekunda Vidya niyyavayya...
Автор: Mandara Makarandam మందార మకరందం
Загружено: 2024-09-20
Просмотров: 88
Описание:
🌹🙏 చదువు సందెలు 🌹🙏
విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయి దండాలు.
ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్ద పెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరస పెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.
చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!
పిల్లలందరు రండి
బళ్లోకి పోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.
విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.
అరటిపండూ తీపి, ఆవుపాల్ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.
అరటిపండూ తీపి, ఆవు పాల్ తీపి
మా చిన్ని అమ్మాయి మాటల్లు తీపి.
చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.
చదువంటె అమ్మాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.
పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.
చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమబ్బేను.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: