Psych Siddhartha Movie Director Varun Reddy MAD Interview |
Автор: Tag Telugu
Загружено: 2026-01-04
Просмотров: 3454
Описание:
Psych Siddhartha Movie Director Varun Reddy MAD Interview | @Tagteluguu
#psychsiddhartha #VarunReddy #exclusiveinterview #podcast #tagtelugu
‘సైక్ సిద్ధార్థ’ డైరెక్టర్ కథేంటో తెలుసా?
ఇది మ్యాడ్ ఇంటర్వూ చూస్తే పిచ్చెక్కిద్ది...
ఇంటర్వూకి వచ్చిన తనను చూసి భయం వేసింది. తాగి ఇంటర్వూకి వచ్చాడా? అని ఒక్క క్షణం ఇంటర్వూ చేయాలా? వద్దా? అని ఆలోచించాను. అతను తాగలేదు. తాగినట్లుగా ఉంటాడు అని కొద్ది సేపటికే అర్థమైంది. జన్–జీ, న్యూ ఏజ్ ఫిల్మ్‌మేకర్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌లా ఉన్నాడనిపించింది. సినిమా సినిమా సినిమా తప్ప ఏం మాట్లాడడు. తాను చేసిన సినిమా థియేటర్‌కి వచ్చి చూసే ప్రేక్షకుడు ప్రతి సీన్‌కి కేక పెట్టాలి అనుకునే సినిమా పిచ్చోడు. తనను చూస్తే ఇతనా ఈ సినిమా డైరెక్ట్ చేసింది అనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ చదువుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు సంపాదించినప్పటికి సినిమా మీద ప్రేమతో అన్నింటిని వదిలేసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో 8 వారాల షార్ట్ టర్మ్ కోర్స్ చేశాడు. 48 అవర్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొని సెల్‌ఫోన్‌తో తీసిన ఒక వీడియోని ప్రెజెంట్ చేసి బెస్ట్ షార్ట్‌ఫిలిమ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డును పొందాడు. ప్రస్తుతం శ్రీనందు హీరోగా నటించిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమాతో దర్శకునిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. అతని పేరు వరుణ్ రెడ్డి. మొదటి ప్రయత్నంలోనే చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సింపుల్ కథని ఎంత కొత్తగా చెప్పొచ్చు అనే విషయాన్ని తన దర్శకత్వ ప్రతిభతో సినిమా చేసి మ్యాజిక్కే చేశాడు. మ్యాజిక్ కాకపోతే తన సినిమాని చూసిన సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్‌బాబు సినిమాని సింగిల్ సిట్టింగ్‌లో కొనేశారంటే మామూలు విషయం కాదు. జనవరి 1న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. 2026కి తొలి హిట్ ‘సైక్ సిద్ధార్థ’కు నిర్మాతలుగా శ్రీనందు, వరుణ్‌లకు జాక్‌పాట్ తగిలింది. వీరి సినిమా కొన్న సురేశ్‌బాబు లాభంలోనే ఉన్నారు. వరుణ్‌రెడ్డి పిచ్చేంటో తెలియాలంటే ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చాలా ఓపెన్ అయ్యారు. ఓ పాపకు తండ్రి, డైవర్సీ. కానీ ప్రస్తుతం తనకో పార్టనర్ ఉంది. డైవర్స్ ఇచ్చిన వైఫ్ సినిమా చూసి ప్రౌడ్ ఆఫ్ యు అంది. కన్ఫూజ్ అవుతున్నారు కదూ...ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓ లుక్కేయండి...ఇంటర్వూ బై శివమల్లాల
Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: