RANI'S PLANTS PARADISE

నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, మా నాన్నగారు నా చిన్నప్పుడు ప్రతి మొక్క గురించి వివరించి చెప్పేవారు, కాని నాకు మొక్కలు పెంచుకోవడానికి స్థలం లేదు, మా ఇంటి మేడమీద కుండీలలో మొక్కలు వేసి వీడియోలు తీసి నా యూట్యూబ్ ఛానల్ లో పెడుతున్నాను.

ఈ రోజుల్లో చాలామందికి మొక్కల గురించి తెలియదు, చిన్న పిల్లకు అయితే ఏ మొక్కకు, ఏ పళ్ళు, ఏ పువ్వులు వస్తాయో అస్సలు తెలియదు, ఇక ఆయుర్వేద మొక్కల గురించి ఏమి తెలుస్తుంది.

అసలు మొక్కలు వేసుకోవడానికి స్థలం ఉంచకుండా ఇల్లంతా ప్లాస్టింగ్ చేసుకుంటున్నారు, ఎవరైనా మొక్కలు పెంచితే ఇరుగు పొరుగు వాళ్ళు ఆకులు పడుతున్నాయానో, ఇంట్లో కొమ్మలు వస్తున్నాయానో గొడవలు పెట్టి ఆ మొక్కలను లేకుండా చేస్తున్నారు, ఇది చాలా బాధకరం.

రోడ్డు వెడల్పు చేయడం కోసం, కరెంట్ స్థంభాలకు అడ్డు వస్తున్నాయని పెద్ద పెద్ద వృక్షాలను నరికేస్తారు, నోరులేని మొక్కలను నరికేస్తున్నప్పుడు నాకయితే చాలా ఏడుపు వస్తుంది.

ఎవరికైన పుట్టినరోజు లేదా పంక్షన్ వస్తే వాళ్లకి నేను మొక్కలనే బహుమతి గా ఇస్తాను, నా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రయిబ్ చేయండి

ధన్యవాదములు 🙏




https://www.youtube.com/@MylavarapuBhavani